👉 జీలుగుమిల్లి మండలం స్వర్ణవారిగూడెంలో అంగన్ వాడి కేంద్రానికి వెళ్లిన ఐదు సంవత్సరాల బాలికను ఒక వ్యక్తి వచ్చి బాలికను తనకు తెలుసు అని చెప్పి తన వెంట తీసుకొని వెళ్లిపోయాడు. బాలిక ఇంకా ఇంటికి రాకపోవడంతో తల్లి పెద్దడ దేవికా అంగన్ వాడి వెళ్లి విచారించారు. బాలికను ఒక వ్యక్తి అంగన్వాడీ కేంద్రానికి వచ్చి తీసుకుని వెళ్లిన విషయం అంగన్వాడీ కేంద్రం వాళ్ళు తెలియచేయగా.. ఈ విషయాన్ని వెంటనే ఏలూరు కంట్రోల్ రూం కు సమాచారాన్ని బాలిక తల్లి దేవిక ఫిర్యాదు చేసింది.
👉 ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీమతి డి మేరీ ప్రశాంతి ఆదేశాలపై పోలవరం డిఎస్పి ఏ శ్రీనివాసులు నాలుగు బృందాలను ఏర్పాటు చేసుకుని, ఒక బృందానికి జీలుగుమిల్లి ఇన్స్పెక్టర్ బి వెంకటేశ్వరరావు, జీలుగుమిల్లి ఎస్సై చంద్రశేఖర రావు, బుట్టాయిగూడెం ఎస్ఐ జయబాబు పోలవరం డిఎస్పి శ్రీనివాసులు పర్యవేక్షణలో బాలికను దేవరపల్లిలో స్వాధీనం చేసుకున్నారు.
👉 బాలికను రక్షించిన పోలవరం డిఎస్పి ఏ శ్రీనివాసులు, జీలుగుమిల్లి ఇన్స్పెక్టర్ బి వెంకటేశ్వరరావు, ఎస్సై చంద్రశేఖర్, జయ బాబు లను బాలిక యొక్క తల్లిదండ్రులు అభినందించి కృతజ్ఞతలు తెలిపారు.