ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ బడేటి బుజ్జి 4వ డివిజన్ కి రూ. 7.కోట్లు ఎస్ సి సబ్ ప్లాన్ నిధులిచ్చి డివిజన్ ని అభివృద్ధి పథంలో నడిపించారని తెలిపారు. డ్రైనేజీకి అధిక నిధులు కేటాయించి కచ్చా డ్రైన్లు, అంతర్గత రహదారులు, పార్కులతో డివిజన్ ను ఆదర్శప్రాయంగా నిలిపారని కొనియాడారు. టిడ్కో ఇళ్లు బుజ్జి హయాంలోని నిర్మాణం ప్రారంభించారని, నగరంలో ఎల్ఈడి లైట్స్, రెండు పూటలా నగర ప్రజల దాహార్తి తీర్చడానికి గోదావరి నీరు అందించిన ఘనత బుజ్జికి దక్కుతుందన్నారు. ఈ సందర్భంగా బడేటి బుజ్జి ఆశయాలను కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు.
అనంతరం పేదలకు పండ్లు, అల్పాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి టిడిపి 10 డివిజన్ల క్లస్టర్ ఇన్చార్జి అమరావతి అశోక్,3వ డివిజన్ టిడిపి అధ్యక్షులు చనపతి వెంకటరమణ, కార్యదర్శి జాలా శివశంకర్, వీరబత్తిన రత్తయ్య, దాలి త్రిమూర్తులు, ఉంకుల రూపేష్, మరి ఏసు, రుద్ర రాజు, గుంటూరు ప్రకాష్ యూత్, సరిపల్లి పెద్దిరాజు, బోన్ రవి, లోకేష్, తోమాటి విక్కి తదితరులు పాల్గొన్నారు.