ఏలూరు జిల్లా, ఆగిరిపల్లి: జిల్లాలో జులై,1వ తేదీ నుండి జులై, 30 వ తేదీ వరకు జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ చెప్పారు. మంగళవారం ఆగిరిపల్లి మండలం చిన్న ఆగిరిపల్లి గ్రామంలో జగనన్న సురక్ష పథకం పై ఇంటింటి సర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్, నూజివీడు సబ్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ తో కలిసి పరిశీలించారు. ఇందులో భాగంగా సర్వే చేపడుతున్న ఇంటి వద్దకు స్వయంగా కలెక్టర్ వెళ్లి వాలంటరీలు నిర్వహిస్తున్న సర్వే ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించారు. సర్వేలో పొందుపరిచిన అంశాన్ని వాలంటరీను అడిగి తెలుసుకున్నారు.
సర్వే పూర్తి చేసిన పిదప వారికి టోకెన్లు రూపంలో రసీదును అందజేయాలని ఆదేశించారు. గ్రామంలో జగనన్న సురక్ష సమావేశం ఎప్పుడు జరుగుతున్నది తెలియజేస్తున్నారా అని ప్రశ్నించారు. అనంతరం గ్రామ సచివాలయానికి వెళ్లి సర్వే నమోదుకు సంబంధించిన వెబ్ సైట్ ను డిజిటల్ అసిస్టెంట్ తో ఓపెన్ చేయించి పొందుపరిచిన అంశాలను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పాత్రికేయులతో మాట్లాడుతూ జూలై 1వ తేదీ నుండి జూలై 30 తేదీ వరకు నెలపాటు నిర్వహించే జగనన్న సురక్ష పథకాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. అర్హత ఉండి ధ్రువపత్రాలు సమర్పించని కారణంగా సంక్షేమ పథకాలు పొందలేకపోయిన ప్రజల వివరాలను సచివాలయంలోని వాలంటీర్లు తమ పరిధిలోని ఇంటింటికి వెళ్లి జూన్ 30వ తేదీ వరకు సర్వే చేపట్టి దరఖాస్తులను సేకరిస్తారని తెలిపారు.
వీటిలో 11 రకాల సేవలను అందించనున్నట్లు తెలిపారు. వీటిలో జనన, మరణ, కుల, ఆదాయ, కుటుంబ, వివాహ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కు ఫోన్ నెంబర్ అనుసంధానం, సిసిఆర్సి కార్డులు తదితర సేవల దరఖాస్తులను అందిస్తారని తెలిపారు. . "జగనన్న సురక్ష " కార్యక్రమం పై ముందుగా మండలంలోని అన్ని గ్రామాలలో విస్తృత ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజలు ఎటువంటి రుసుము చెల్లించకుండా ధ్రువపత్రాలను ఉచితంగా పొందవచ్చన్నారు. గ్రామంలో జరిగే జగనన్న సురక్ష షెడ్యూల్ ను గ్రామ సచివాలయం నోటీసు బోర్డులో ప్రదర్శిస్తారని ఆ తేదీలలో అధికారులు బృందాలుగా వస్తారని తెలిపారు. జగనన్న సురక్ష పథకాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి పి వెంకటరత్నం, తాసిల్దార్ ఉదయభాస్కర్, ఎంపీడీవో పి. శంకర్రావు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
BCN OTT
Tags
ELURU District