గాడ్ ఫాదర్, భోళా శంకర్ ఇలా వరుస షాక్ లు మెగాస్టార్ ని కూడా ఆలోచనలో పడేశాయి. అందుకే యువ దర్శకుడు వశిష్టతో విశ్వంభర సినిమా చేస్తున్నాడు. బింబిసార తో సత్తా చాటిన వశిష్ట తన నెక్స్ట్ సినిమానే చిరుతో ప్లాన్ చేయడం ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. మెగా ఫ్యాన్స్ ఎన్ని అంచనాలు పెట్టుకున్నా దానికి మించి సినిమా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.
విశ్వంభర సినిమా కాన్సెప్ట్ ఏంటి అసలు ఫస్ట్ గ్లింప్స్ లో ఏం చూపించారు అన్న దాని మీద సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో చర్చలు జరుగుతుండగా లేటెస్ట్ గా ఈ సినిమాను కూడా మేకర్స్ రెండు భాగాలుగా తెరకెక్కించే ప్లానింగ్ లో ఉన్నారని చెప్పుకుంటున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కే స్టార్ సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా రిలీజ్.. రెండు భాగాలుగా ప్లానింగ్ అనేది కామన్ అయ్యింది. బాహుబలి నుంచి ఈ ఆనవాయితీ కొనసాగుతుంది. బాహుబలి 1, 2 వర్క్ అవుట్ అవ్వగా.. కె.జి.ఎఫ్ అదే ఫాలో అయ్యింది.
పుష్ప కూడా ఇప్పుడు అదే సెంటిమెంట్ తో వస్తుంది. సలార్ కూడా రెండు భాగాలుగా వస్తుంది. దేవర ని కూడా రెండు ముక్కలుగా రిలీజ్ చేస్తున్నారు. ఇదే ఫార్ములాతో విశ్వంభర సినిమాను కూడా రెండు పార్టులుగా చెప్పబోతున్నారట. అయితే ఈ విషయాన్ని మేకర్స్ చాలా సీక్రెట్ గా ఉంచాలని భావిస్తున్నారు. విశ్వంభర కథ బాగా రావడంతో సినిమాను అనుకున్న బడ్జెట్ లో రెండు భాగాలు పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారట.
మెగాస్టార్ చిరంజీవి కూడా అందుకు ఓకే చెప్పడంతో మేకర్స్ అదే ప్లాన్ వర్క్ అవుట్ చేస్తున్నారట. విశ్వంభర సినిమా మొత్తం పూర్తి చేసి దాన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. అదే జరిగితే చిరు చేస్తున్న మొదటి పాన్ ఇండియా మూవీ.. మొదటి భారీ సినిమా ఇదే అవుతుంది. ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సినిమాలో అనుష్క త్రిష ఇద్దరు అందాల భామలు నటిస్తున్నారు. సినిమా టైటిల్ గ్లింప్స్ అదిరిపోగా సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటుందని చెప్పుకుంటున్నారు.