'జగనన్న ఆణిముత్యాలు' అవార్డు సాధించడంలో ప్రతీ విద్యార్ధీ పోటీ పడాలి: జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ


 ఏలూరు జిల్లా, పెదపాడు: 'జగనన్న ఆణిముత్యాలు' అవార్డు సాధించడంలో ప్రతీ విద్యార్ధీ పోటీ పడాలని జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ అన్నారు. పెదపాడు మండలం సత్యవోలు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంగళవారం సందర్శించి అక్కడి విద్యార్థినులతో వారి విద్యా ప్రగతిని గురించి పద్మశ్రీ అడిగి తెలుసుకున్నారు.  ఈ సందర్భంగా ఘంటా పద్మశ్రీ మాట్లాడుతూ పేదరికాన్ని పారద్రోలేది విద్య మాత్రమేనని, అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వేలాది కోట్ల రూపాయలు విద్యాభివృద్ధి ఖర్చు చేస్తున్నారన్నారు. అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన జగనన్న విద్యా కానుక, విదేశీ విద్యా దీవెన వంటి ఎన్నో పధకాలను అమలు చేస్తున్నారని, అంతేకాక నాడు-నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా రూపుదిద్దుతున్నారన్నారు. ప్రభుత్వం చేపట్టిన ఎటువంటి కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో  ఎన్రోల్మెంట్ పెరిగిందన్నారు. 

ప్రభుత్వ పాఠశాలల్లో కూడా విద్యా ప్రమాణాల స్థాయి పెరిగిందన్నారు.   ప్రభుత్వ పాఠశాలల్లో అత్యంత ప్రతిభ కనపరచిన విద్యాధినీ విద్యార్థులను గుర్తించి 'జగనన్న ఆణిముత్యాలు' కార్యక్రమం ద్వారా నగదు బహుమతిని అందించి, సత్కరిస్తున్నామన్నారు.  ఈ అవార్డు సాదించేందుకు ప్రతీ విద్యార్థిని, విద్యార్థులు  పోటీ పడాలన్నారు. అనంతరం పాఠశాలలో జరుగుతున్న నాడు-నేడు పనులను పరిశీలించారు. అనంతరం  పాఠశాల ఆవరణలో మొక్కలను నాటారు.

         

ఈ కార్యక్రమంలో  వై ఎస్ ఆర్ సి పి బి.సి. సెల్ జిల్లా  అధ్యక్షులు ఘంటా ప్రసాదరావు, తహసీల్దార్ విజయకుమార్ రాజు, ఎంపిడిఓ ఎస్. నిర్మల జ్యోతి, సొసైటీ అధ్యక్షులు అక్కినేని రాజశేఖర్, మండలాధ్యక్షురాలు బత్తుల రత్నకుమారి, సర్పంచ్ రంభ ఉమామహేశ్వరి, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆళ్ళ సతీష్ చౌదరి, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు అప్పన్న ప్రసాద్, మండల సచివాలయాల కన్వీనర్ గోపి,  ప్రభృతులు పాల్గొన్నారు.

ఈ మార్కెట్ లో ఎన్నో ఓటిటి ప్లాట్ ఫామ్స్ వచ్చాయి.. అవి అన్ని నెలనెలా పెమేంట్ చేయాలి.. మన BCN OTT ఫ్లాట్ ఫాం పూర్తిగా ఉచితం... మీరు ఇంట్లో మరియు ప్రయాణంలో ఉన్నప్పుడు మీ సెల్ ఫోన్ లో అన్ని చానల్స్, రెడియో ఎఫ్ ఎం, న్యూస్ పేపర్, మూవీస్స్ చూడవచ్చును.

BCN OTT
app Download link 
BCN TV LIVE link 

SANA TV LIVE link 
ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. 365 రోజులు 24 గంటలు పాటలు వినండి ఓలాసంగా ఆనందంగా ఉండండి.
ELURU FM (All songs)
app DOWNLOAD link 

Previous Post Next Post