👉 ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గ్రామ వార్డు స్థాయిలలో ఏర్పాటుచేసిన సచివాలయాల్లో పనిచేస్తున్న గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి నిర్వహించవలసిన విధి నిర్వహణ గురించి వారు సేకరించవలసిన సమాచారం గురించి అధికారులకు తెలిపారు.
👉 శాంతి పద్ధతుల పరిరక్షణ కొరకు ముందస్తు సమాచారాన్ని గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి ద్వారా క్షేత్రస్థాయిలో సమాచారాన్ని సేకరించాలని నిర్ణయించారు.
👉 అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ విషయాలపై అధికారులు ముందస్తు సమాచారాన్ని సేకరించి విషయం చిన్నగా ఉన్నప్పుడే పరిష్కరించినట్లయితే అది శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉంటుందని తెలిపారు.
👉 గ్రామ వార్డు పరిధిలో అసాంఘిక కార్యకలాపాల నివారణ కొరకు ప్రతి ఒక్కరు ముందస్తు సమాచారాన్ని సేకరించి అసాంఘిక కార్యకలాపాలు నివారణ కొరకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.
👉 ప్రజారోగ్యానికి హానికరమైనటువంటి నాటు సారా తయారీపై ఉక్కుపాదం మోపాలని క్రికెట్ భేట్టింగ్లు కోడిపందాలు పేకాటల నివారణ కొరకు సమాచార సేకరణ చేయాలని ఎవరైనా జూద క్రీడల పాల్పడితే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.
👉 పోలీస్ సిబ్బంది ప్రో యాక్టివ్ గా ఉండి నేర నియంత్రణ కొరకు ఉద్యోగ నిర్వహణ చేయాలని, ఏదైనా నేరం జరిగిన తర్వాత దర్యాప్తు చేసే కంటే నేరం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం ఎంతో మేలు చేసిన వారు అవుతారని తెలిపారు.
👉 పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా నడుచుకొని వారి యొక్క సమస్యను పరిష్కరించేలాగా చర్యలు ప్రతి ఒక్కరు తీసుకోవాలని తెలిపారు.
👉 రహదారి ప్రమాదాల నివారణ కొరకు గంజాయి అక్రమ రవాణా నివారణ కొరకు పటిష్టమైన చర్యలు అధికారులు తీసుకోవాలని ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు జిల్లా ఎస్పీ ఆదేశాలు ఇచ్చారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ శ్రీ ఎం.జె.వి భాస్కర రావు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ శ్రీ ఎన్. సూర్య చంద్ర రావు, ఎస్.బి ఇన్స్పెక్టర్ ఎం సుబ్బారావు, డి.సి.అర్.బి ఇన్స్పెక్టర్ దుర్గ ప్రసాద్, ఎస్ ఐ సాదిక్ పాలుగొన్నారు.