ఏలూరు: జాతీయ న్యాయ సేవాధికార సంస్థ న్యూఢిల్లీ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశానుసారంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఏలూరు వారి ఆధ్వర్యంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఈనెల 9 తేదీన నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కు జిల్లా వ్యాప్తంగా 36 బెంచీలు ఏర్పాటు చేయడం జరిగినది. వీటిలో
ఏలూరులో 9 బెంచీలు, భీమవరం 4, కొవ్వూరు 4, నరసాపురం 3, తణుకు 5, తాడేపల్లిగూడెం 4, పాలకొల్లు 1, నిడదవోలు 2, జంగారెడ్డిగూడెం 2, చింతలపూడి 1, భీమడోలు 1, కోర్టుల పరిధిలో బెంచిలను ఏర్పాటు చేయడం జరిగిందని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి పురుషోత్తం కుమార్ ఆదివారం తెలియజేశారు.
జాతీయ లోక్ అదాలత్ లో జిల్లావ్యాప్తంగా 1908 పెండింగ్ కేసులను పరిష్కారం చేయడం జరిగిందని, ఇందులో 1610 క్రిమినల్ కేసులు, 40 కుటుంబ వివాద కేసులు, 111 మోటార్ వాహన ప్రమాద భీమా కేసులు, 147 సివిల్ కేసులను రాజీ చేయగా 151 ఫ్రీ లిటిగేషన్ కేసులు పరిష్కారం చేపడ్డాయని తెలిపారు. వీటిలో ఏలూరు 428 భీమవరం 304, చింతలపూడి 103, జంగారెడ్డిగూడెం 138, కొవ్వూరు 169, నర్సాపురం 162, పాలకొల్లు 58, తాడేపల్లిగూడెం 185, తణుకు 230, నిడదవోలు 68 మరియు భీమడోలు 63 కేసులు (పెండింగ్ కేసులను) ఈజాతీయ లోక్ అదాలత్ నందు పరిష్కరించామని తెలిపారు. వీటితో పాటుగా జిల్లా వ్యాప్తంగా 6,804 పెట్టి కేసులను కూడా రాజీ చేయడం జరిగిందని తెలిపారు.
జాతీయ లోక్ అదాలత్ లో కేసుల పరిష్కారానికి తోడ్పడిన న్యాయవాదులకు, పోలీస్ అధికారులకు, రెవెన్యూ సిబ్బందికి, ఇన్సూరెన్స్ అధికారులకు, బ్యాంకు అధికారులకు, చిట్ ఫండ్ ప్రతినిధులకు, లేబర్ డిపార్ట్మెంట్ అధికారులకు, మున్సిపల్ సిబ్బందికి, బిఎస్ఎన్ఎల్ వారికి, జిల్లా పంచాయతీ శాఖ వారికి, పత్రిక విలేకరులకు, ఆల్ ఇండియా రేడియో విజయవాడ వారికి, రవాణాశాఖ అధికారులకు, ఎక్సైజ్ అధికారులకు, రైల్వే శాఖ అధికారులకు, అడ్వకేట్ క్లర్కులకు, అగ్రికల్చరల్ అధికారులకు మరియు మిగతా శాఖల అందరికీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్-కం-జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి. పురుషోత్తమ కుమార్ మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ-కం- సీనియర్ సివిల్ జడ్జి ఎస్.కె రత్న ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు.