"నాభూమి-నాదేశం- అమృత" కలిశయాత్ర కార్యక్రమం భావితరాల వారికి ఆదర్శం కావాలి: జిల్లా యూత్ అధికారి డి కిషోర్


ఏలూరు: మన స్వాతంత్ర్య సమరయోధుల జీవితాల గురించి ఈనేలకోసం తమ ప్రాణాలు త్యాగం చేసిన వీరుల గురించి భావితరాలకు తెలియజేసి వారి పట్ల గౌరవాన్ని పెంపొందించి వారి స్పూర్తిని యువతలో నింపడం "నాభూమి-నాదేశం" కార్యక్రమ ముఖ్య ఉద్ధేశ్యమని నెహ్రూ యువకేంద్రం జిల్లా యూత్ అధికారి డి. కిషోర్ తెలిపారు. 


స్ధానిక యంపిడిఓ కార్యాలయం నుండి "నాభూమి-దేశం" అమృత కలిశయాత్ర ర్యాలీ ప్రారంభించబడింది. ఈ సందర్బంగా యువకేంద్రం జిల్లా యూత్ అధికారి డి. కిషోర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమిష్టితో రాష్ట్ర మంతటా "నాభూమి-నాదేశం" కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగానే ఏలూరు మండలంలోని అన్ని గ్రామ సచివాలయాల నుంచి మట్టిని సేకరించి కుండల్లో వేసి విజయవాడ చేరవేయడం జరుగుతుందని తెలిపారు.  


ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్ధేశ్యం ప్రధాన మంత్రి అమృతోత్సవాల్లో భాగంగా "నాభూమి-నాదేశం" కార్యక్రమం తీసుకోవడం జరిగిందని తెలిపారు.  


జాతీయస్ధాయిలో తీసుకున్న కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అభివృద్ది చెందిన భారతదేశంలో ప్రతి ఒక్కరిని భాగస్వాములుగా చేసి భారతదేశాన్ని విశ్వగురువుగా చేర్చడమే "నాభూమి-నాదేశం" ప్రధాన ఉద్ధేశ్యమన్నారు. గ్రామీణ భారతానికి ఫ్రాధాన్యతనిస్తూ మట్టి విలువను తెలియజేస్తూ దేశంకోసం సర్వస్వం అర్పించి వీరులస్పూర్తిని ప్రతి ఒక్కరిలో నిలపడమే ఈ కార్యక్రమ సంకల్పమన్నారు.   


ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంధ సేవా సంస్ధలు, విద్యాసంస్ధలు, సచివాలయ సిబ్బంది, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం అభినందనీయమన్నారు.  


ఈ కార్యక్రమంలో సెట్ వెల్ ముఖ్యకార్య నిర్వహణాధికారి యం.డి.హెచ్ మెహరాజ్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు "నాభూమి-నాదేశం" కార్యక్రమం ఏలూరు మండలానికి సంబంధించి గ్రామీల్లోని మట్టిని సేకరించి మనరాష్ట్రంలోని అన్ని కలశాలను విజయవాడకు పంపడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని కలశాలను ఢిల్లీకి పంపడం జరుగుతుందని తెలిపారు.  


ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న ప్రతిఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏలూరు యంపిపి పెన్మెత్స శ్రీనివాసరావు, యంపిడిఓ బి. ప్రణవి, వివిధ శాఖల అధికారులు, సచివాలయాల సిబ్బంది, విద్యార్ధినీ విద్యార్ధులు, స్వచ్ఛంద సేవా సంస్ధల ప్రతినిధులు, ఉపాధ్యాయులు, భరతనాట్య కళాకారులు, తదితరులు పాల్గొన్నారు.

Previous Post Next Post