ప్రముఖ జ్యోతిషుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రముఖంగా సినిమా వాళ్ల జాతకాలు చెప్పే ఈయన... సినిమా ఫలితాలపై కూడా తనదైన జోస్యం చెబుతుంటారు. ఇందులో భాగంగా ప్రభాస్ 'ఆదిపురుష్' ఫ్లాప్ అవుతుందని.. 'పుష్ప' సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ మారిపోతుందని చెప్పి సంచలనం సృష్టించారు.
ఇదే సమయంలో రాజకీయ నేతలపై కూడా ఆయన చెప్పినవి జరగడంతో సోషల్ మీడియాలో వేణు స్వామి పెద్ద సెలబ్రిటీగా మారిపోయారు. ఇందులో భాగంగా... తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్ తిరిగి సీఎంలు అవుతారని గతంలోనే చెప్పారు వేణు స్వామి! కామన్ సెన్స్ తో ఇవి చెబుతారా.. లేక, జోతిష్యం అని చెబుతారా అనే సంగతి కాసేపు పక్కనపెడితే... సీఎంల విషయంపై మరోసారి స్పందించారూ వేణు స్వామి!
తిరుపతి వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న సందర్భంగా ఆయన్ను చుట్టుముట్టిన మీడియా ప్రతినిధులు... వేణు స్వామిపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇందులో భాగంగా... ఏపీకి కాబోయే సీఎం ఎవరంటూ ఆయన్ని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన వేణు... తాను గతంలోనే దీనిపై మాట్లాడానని, అదే జరుగుతుందని తెలిపారు.
అయితే చంద్రబాబు అరెస్ట్ అయ్యారు కదా.. మరి ఇప్పుడు అందులో ఏమైనా తేడా ఉంటుందా అని అడగా... ఎన్ని జరిగినా, ఏమి జరిగినా కూడా గతంలో తాను చెప్పిన వారే సీఎం అవుతారని వేణుస్వామి మరోసారి పునరుద్ఘాటించారు. అయితే పేర్లు చెప్పాలని కోరగా.. దేవుడు సన్నిధిలో ఉన్నామని, రాజకీయల గురించి ఇక్కడ మాట్లాడం సరైంది కాదంటూ వేణుస్వామి అక్కడ నుంచి వెళ్లిపోయారు.
దీంతో... చంద్రబాబు అరెస్ట్ తరువాత కూడా ఏపీకి జగనే సీఎం అని వేణుస్వామి చెప్పిన మాటలను బట్టి చూస్తే అర్థం అవుతుందని అంటున్నారు. కాగా... గతంలో ఒకసారి ఇదే విషయంపై స్పందించిన ఆయన... రాబోయే ఎన్నికల అనంతరం కూడా ఏపీకి వైఎస్ జగనే సీఎం అవుతారని చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పేరు చెప్పకుండా.. అదే విషయాన్ని పు పునరుద్ఘాటించినట్లయ్యింది.
చంద్రబాబు మీద కక్ష లేదంటున్న ఏపి సిఎం జగన్... నిజమేనా...?
ఏపీ ఆడబడుచులకు జగనన్న కట్నం... ఒకేసారి 5 లక్షల గృహాల ప్రారంభం!