ఏలూరు: ఏలూరు,దక్షిణపు వీధిలో వేంచేసియున్న శ్రీ మార్కండేయ ఓంకార విశ్వేశ్వర స్వామి మరియు అయ్యప్ప స్వామి వార్ల దేవస్థానంలో బుధవారం ఉదయం ఏలూరు జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ శ్రీ అయ్యప్ప మాల ధారణ ధరించారు. అయ్యప్ప మాల దారుణ తీసుకున్నా అనంతరం అర్చకులు కందుకూరి వెంకట కన్నబాబు, కందుకూరి వాసుదేవ శర్మ అధ్వర్యంలో కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తొలుత శ్రీ అయ్యప్ప మాలధారణ తీసుకోవటానికి ఆలయానికి విచ్చేసిన కలెక్టర్ వె .ప్రసన్న వెంకటేష్ వారికి ఆలయ చైర్మన్ కె. జనార్దన్ రావు, స్థానిక కార్పొరేటర్ కర్రీ శ్రీను, ఈవో డి శంకర్రావు, ధర్మకర్తలు k. సాయి, డి. కమల, టి. రమేష్, ఎం .గంగాధర్ రావు, బుచ్చిరాజు, తహశీల్దార్ సోమశేఖర్ మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు.
అనంతరం గురుస్వామి తడికిమళ్ళ ప్రసాద్ సమక్షంలో ఆలయ అర్చకులు కందుకూరి వెంకట కన్నబాబు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ కు సంప్రదాయబద్దంగా శ్రీ అయ్యప్ప మాలధారణ ధరింపచేశారు.
Tags
ELURU District