ఏలూరు జిల్లా, పెదపాడు: సంక్షేమ పధకాలను నూరుశాతం అర్హులకు అందించడమే 'జగనన్న సురక్ష' కార్యక్రమం ప్రధాన లక్ష్యమని జిల్లా ప్రజా పరిషత్ గాఢ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ అన్నారు. పెదపాడు మండలం సత్యవోలు గ్రామంలోని ఘంటా వెంకట కనకం పార్వతమ్మ కల్యాణ మండపంలో మంగళవారం 'జగనన్న సురక్ష' కార్యక్రమంలో పాల్గొని ప్రజలను ధ్రువీకరణ పత్రాలను చైర్ పర్సన్ అందించారు. ఈ సందర్భంగా ఘంటా పద్మశ్రీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి, రైతుభరోసా, పెన్షన్లు, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, ఆసరా, వంటి ఎన్నో సంక్షేమ పధకాలను పేదవారి సంక్షేమానికి అమలు చేస్తున్నదన్నారు. అర్హత ఉండి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పధకాలు పేదవారిని గుర్తించి పధకాలు మంజూరు కాకపోవడానికి గల కారణం తెలుసుకుని, వారికి అవసరమైన ధ్రువీకరణ పత్రాలను ఉచితంగా అందించి సంక్షేమ పధకాలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
కుల, మత , ప్రాంతాలకు, పార్టీల కతీతంగా సంక్షేమ ఫలాలను అర్హులైన పేదలందరికీ అందిస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. పెదపాడు మండలంలో ఇల్లు లేని ప్రతీ నిరుపేదకు పక్కా గృహం అందించామన్నారు. వై ఎస్ ఆర్ సి పి బి.సి. సెల్ జిల్లా అధ్యక్షులు ఘంటా ప్రసాదరావు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ జరగని రీతిలో ప్రస్తుత ప్రభుత్వ హయాంలో సత్యవోలు గ్రామంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. సత్యవోలు గ్రామంలో అమ్మఒడి, రైతు భరోసా, డ్వాక్రా మహిళలకు రుణ మాఫీ కార్యాక్రమం ద్వారా 3. 33 కోట్ల రూపాయలు అందించడం జరిగిందన్నారు. నాడు-నేడు కార్యక్రమం ద్వారా కోటి రూపాయలతో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షురాలు బత్తుల రత్నకుమారి, సర్పంచ్ రంభ ఉమామహేశ్వరి, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆళ్ళ సతీష్ చౌదరి, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు అప్పన్న ప్రసాద్, మండల సచివాలయాల కన్వీనర్ గోపి, ప్రభృతులు ప్రసంగించారు. అనంతరం జగనన్న సురక్ష కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న ధ్రువీకరణ పత్రాలను ప్రజలకు జిల్లా పరిషత్ చైర్మన్ ఘంటా పద్మశ్రీ అందించారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విజయకుమార్ రాజు, ఎంపిడిఓ ఎస్. నిర్మల జ్యోతి, సొసైటీ అధ్యక్షులు అక్కినేని రాజశేఖర్, ప్రభృతులు పాల్గొన్నారు.
BCN OTT
Tags
ELURU District