ఐటిఐ లలో రెండవ విడత ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానం


ఏలూరు జిల్లా ఏలూరు: ఏలూరులో కలెక్టరేట్ ఆఫీస్ దగ్గరలో గల ప్రభుత్వ జిల్లా స్థాయి శిక్షణ కేంద్రం ఫిట్టర్, ఫ్రిడ్జ్, ఏ .సి. మెకానిక్, వెల్డర్, మెకానిక్ డీజిల్, ఎలక్ట్రీషియన్ ట్రేడ్ లకు (Govt DLTC /ITI) ఏలూరు నందు రెండవ విడత ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సహాయ సంచాలకులు ఉగాది రవి తెలిపారు. 2023 2024 విద్యాసంవతరానికి గాను సంస్థ నందు సీట్ల భర్తీకి రెండవ విడత కౌన్సిలింగ్ నిరహించబడునని తెలిపారు. విదార్థులు |https://iti ap gov.in website ద్వారా  జులై, 31 సాయంత్రం 5 గంటలలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు కాలేజీ పని వేళలలో ఆఫీస్ నందు సంప్రతించవచ్చని, దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు GOVT DLTC/ITI ELURU నందు ఆగష్టు 3 మరియు 4 తేదీలలో జరుగు కౌన్సిలింగ్ నకు ఎస్ ఎస్ సి., 6 నుండి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్, పాస్ పోర్ట్ సైజు ఫోటో,  ఆధార్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల యొక్కఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని, ఇతర వివరాలకు 8332836944 ఫోన్ నంబర్ కు సంప్రతించాలన్నారు.

Previous Post Next Post