ఆడుదాం ఆంధ్రా నియోజకవర్గ స్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో గొల్లగూడెం క్రీడాకారులు జయకేతనం ఎగురవేశారు. మంగళవారం నారాయణపురం డిగ్రీ కళాశాలలో జరిగిన బ్యాడ్మింటన్ ఫైనల్ లో మహిళల విభాగంలో ప్రథమ, పురుషుల విభాగంలో తృతీయ స్థానాల్లో విజయం సాధించారు. విజేతలకు ఉంగుటూరు శాసన సభ్యులు పుప్పాల వాసుబాబు ప్రైజ్ మనీని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా క్రీడాకారులను గ్రామ వైసీపీ నాయకులు మలకలపల్లి నాగ వెంకట శివ ప్రసాద్ అభినందించడం జరిగింది.