ఈ సందర్భంగా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ దత్తతదారులు తాము దత్తత తీసుకున్న పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు అందించడంతో పాటు, వారిని ప్రేమ, ఆప్యాయతతో పెంచాలన్నారు. సదరు పిల్లల బాగోగులను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉండాలన్నారు. ఈ సందర్భంగా పిల్లలను కలెక్టర్ ఎత్తుకుని ప్రేమగా ముద్దాడారు. బేబీ మౌనిక 5 నెలల వయస్సు గల పాపను తిరుపతి, ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన దత్తత అర్జీదారులు శ్రీరామ సుబ్బారాయుడు మరియు చంద్రకళలకు దత్తత అందజేశారు.
దత్తత అర్జీ దారులు 2019 సం.లో ఆడ పాప కొరకు దరఖాస్తు చేసుకున్నారు. శ్రీరామ సుబ్బారాయుడు SVIMS నందు సుపరింటెండెంట్ గా పనిచేస్తున్నారు. చంద్రకళ ACDPO గా పని చేస్తున్నారు. మరో పాప బేబీ చంద్రిక 4 నెలల వయస్సు గల పాపను మహారాష్ట్రకు చెందిన దత్తత అర్జీదారులు శ్రీనివాస్ దేశముఖ్ మరియు అశ్వని దేశముఖ్ అను వారికి దత్తత అందజేశారు. దత్తత అర్జీ దారులు 2020 సం.లో ఆడ పాపా కొరకు దరఖాస్తు చేసుకున్నారు. శ్రీనివాస్ దేశముఖ్ బ్యాంకు ఏజెంట్ గా పనిచేస్తున్నారు. అశ్వని దేశముఖ్ గృహిణిగా వున్నారు. ఈ సందర్భంగా దత్తత ధ్రువపత్రాలను అయ్యా దంపతులకు కలెక్టర్ అందజేశారు.