ఏపీలో కుప్పకూలిన వంతెన: ఏపీ, తెలంగాణాల మధ్య ఆ మార్గంలో రాకపోకలు బంద్!!


 ఏపీలో రోడ్లు, వంతెనలు పాడైపోతున్నా, కుప్ప కూలిపోతున్నా పట్టించుకునే నాధుడే లేడని ఏపీ వాసులు పదేపదే చెప్తున్న విషయం తెలిసిందే. వైసీపీ ప్రభుత్వంలో రోడ్లు అధ్వాన్నంగా మారాయని కూడా ప్రతిపక్ష పార్టీలు అనేకమార్లు ఆందోళనలు చేశాయి. జగన్ సర్కార్ హయాంలో గుంతల మయంగా రోడ్లు మారి నరకాన్ని తలపిస్తున్నాయి అని టీడీపీ, జనసేన, బీజేపీ లు సైతం ఆందోళనలు నిర్వహించాయి.


ఏపీలో పరిస్థితులు మారలేదు. రోడ్ల దుస్థితి అక్కడ పాలనను కళ్ళకు కట్టినట్టు చెప్తుంది. తాజాగా ఇక ఇదే క్రమంలో తాజాగా ఎన్టీఆర్ జిల్లాలో వంతెన కూలిపోయింది. దీంతో ఆ మార్గం గుండా ప్రయాణాలు చేసేవారికి రాకపోకలు నిలిచిపోయాయి. ఎన్టీఆర్ జిల్లాలో వంతెన కూలిపోవటంతో తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఎన్టీఆర్ జిల్లాలోని గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో మెట్టగుట్ట రోడ్డులో ఆర్ అండ్ బీ ప్రధాన రహదారిపై ఉన్న మోరీ వంతెన కుప్ప కూలింది. దీంతో వాహన రాక పోకలకు తీవ్ర అసౌకర్యం నెలకొంది. కాలినడకన వెళ్ళే వీలు కూడా లేక పోవటంతో కాలినడకన వెళ్ళే పాదచారులు కూడా తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.

అధిక లోడుతో నిత్యం లారీలు ఎక్కువగా రాకపోకలు సాగిస్తున్న క్రమంలో రోడ్డు ధ్వంసం అయ్యిందని స్థానికులు చెప్తున్నారు. ఇక మోరీ వంతెన కూలిపోయే స్థితిలో ఉందని అధికారుల దృష్టికి తీసుకు వెళ్ళినప్పటికీ అధికారులు పట్టించుకో లేదని అంటున్నారు. ఇప్పుడు వంతెన కూలిపోయినా పట్టించుకోలేదని అంటున్నారు. అధిక లోడుతో ఇసుక లారీలు రాకపోకలు సాగిస్తున్నాయని, అందుకే వంతెన కూలిపోయిందని అంటున్నారు. వెంటనే రోడ్డు మరమ్మత్తు పనులు ప్రారంభించి త్వరిత గతిన వంతెన అందుబాటులోకి తీసుకురావాలని వారు కోరుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఈ మార్గం గుండా రాకపోకలను పునరుద్ధరించాలని వారు కోరుతున్నారు. రోడ్లు అధ్వాన్నంగా ఉన్నా పట్టించుకున్న పాపాన పోవటం లేదని వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జగన్ సర్కార్ త్వరగా దీనిపై స్పందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Previous Post Next Post