అన్న‌తోనే అస‌లు స‌వాల్‌.. ష‌ర్మిలను జ‌నం న‌మ్ముతారా?

ఇప్పుడు ప్ర‌జ‌ల‌ను న‌మ్మించ‌డం మ‌రో స‌వాల్‌. అన్నను ఎదిరించే విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. ప్ర‌జ‌ల‌ను న‌మ్మించ‌డం.. ప్ర‌ధాన టాస్క్‌గా మారుతుంది. 


ఏపీ కాంగ్రెస్ ప‌గ్గాలు చేప‌ట్టిన ష‌ర్మిల రేపో మాపో రంగంలోకి దిగిపోతున్నారు. అయితే.. ఏపీలో ఆమెకు టార్గెట్‌ ఎవ‌రు? అంటే.. అంతిమంగా.. సొంత అన్న‌.. అధికార పార్టీ నాయ‌కుడు వైఎస్ జ‌గ‌నే. ఆయ‌నను ఢీ అంటే ఢీ అనేలా వ్య‌వ‌హ‌రిస్తార‌నే ప్ర‌ధాన సంకల్పంతోనే కాంగ్రెస్ పార్టీ ఈమెకు ప‌గ్గాలు అప్ప‌గించింది. హుటాహుటిన ఆరు మాసాలు కూడా తిర‌గ‌కుండానే.. గిడుగు రుద్ర‌రాజుతో రాజీనామా చేయించి.. సీటు ఖాళీ చేసి మ‌రీ ష‌ర్మిల‌కు ఇచ్చేసింది. 


ఇప్పుడు ష‌ర్మిల టార్గెట్ అంతా సొంత అన్నే. ఆయ‌న‌ను అధికారం నుంచి నిలువ‌రించి.. కాంగ్రెస్ ఓటు బ్యాంకును సొంతం చేసుకుని.. దానిని కాంగ్రెస్‌కు మ‌ళ్లించాల్సిన ప్ర‌ధాన క్ర‌తువును ఆమె నిర్వ‌ర్తించాల్సి ఉంటుంది. అయితే.. ఇప్పుడు ప్ర‌జ‌ల‌ను న‌మ్మించ‌డం మ‌రో స‌వాల్‌. అన్నను ఎదిరించే విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. ప్ర‌జ‌ల‌ను న‌మ్మించ‌డం.. ప్ర‌ధాన టాస్క్‌గా మారుతుంది. అస‌లు రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేసిందే.. వైసీపీ అధినేత‌, సొంత అన్న జ‌గ‌న్ కార‌ణంగా. ఈ విష‌యాన్ని ష‌ర్మిల మ‌రిచిపోయినా.. ప్ర‌జ‌లు మ‌రిచిపోలేదు. 


జ‌గ‌న‌న్న వ‌ద‌లిన బాణంగానే త‌న‌ను తాను ప‌రిచ‌యం చేసుకుని పాద‌యాత్ర చేసిన ష‌ర్మిల‌.. గ‌త ఎన్నికలకు ముందు కూడా.. అన్న కోసం అలుపెరుగని ప్ర‌య‌త్న‌మే చేసింది. కాబ‌ట్టి.. జ‌గ‌న్‌ను వేరుగా.. ష‌ర్మి ల‌ను వేరుగా ప్ర‌జ‌లు భావించ‌లేదు. కానీ, ఇప్పుడు ఆమె వేరు ప‌డింది. దీనిని ప్ర‌జ‌లు ఎలా న‌మ్ముతారు? న‌మ్మించే ప్ర‌య‌త్నంలో ష‌ర్మిల దూకుడు చూపించే అవ‌కాశం ఉండొచ్చు. కానీ, న‌మ్మ‌కం అనేది వైఎస్ త‌ర్వాత‌.. జ‌గ‌న్‌కు ద‌ఖ‌లు ప‌డిన రాజ‌కీయ ఆస్తిగానే చూస్తున్నారు. 


పైగా ష‌ర్మిల‌.. పొరుగు రాష్ట్రంలో పార్టీ పెట్టుకుని నేనున్నానంటూ.. తెలంగాణ‌ను ఉద్ద‌రిస్తానంటూ.. పాద యాత్ర చేప‌ట్టారు. అక్క‌డ విశ్వ‌స‌నీయ‌త దేవుడెరుగు.. ప్ర‌జ‌ల మ‌న‌సులు దోచుకోవ‌డంలో ఫ్లాప్ అయ్యారనేది వాస్త‌వం. ఏపీ ప్ర‌జ‌లు ఆ విష‌యాల‌ను రాజ‌కీయ వాస్త‌వాల‌ను గుర్తిస్తూనే ఉన్నారు. ఇలాంటి స‌మ‌యంలో ఆస్తుల విష‌యంలో ఆగ‌డం చేశార‌ని చెప్పినా.. ప్ర‌జ‌లు విశ్వ‌సించే ప్ర‌య‌త్నం చేయ‌రు. రాజ‌కీయంగా ఆస్తుల పంప‌కాలు.. సాధ్యంకాదు. పైగా ఇవి అన్ని కుటుంబాల్లోనూ త‌ర‌చుగా తెర‌మీదికి వ‌స్తున్న‌వే. సో.. ఎలా చూసుకున్నా.. ప్ర‌జ‌ల‌ను ఒప్పించడం అనే కీల‌క విష‌య‌మే ష‌ర్మిల‌కు ఇప్పుడు ప్ర‌ధాన అస్త్రంగా మారింది. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

 

Previous Post Next Post