జిల్లాలో జనవరి 1 నుంచి 8వ తేదీ వరకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపుపై అవగాహన కార్యక్రమం


 *జిల్లాలో 2,33,726 మందికి పెన్షన్ పెంపు....* 


 *ఇకనుంచి పెంపుదల చేసిన పెన్షన్ రూ. 3 వేలు అందజేత...* 


 *జనవరి నుంచి మరో 9 వేల 326 మందికి కొత్త పెన్షన్లు అందజేత...* 


 *జిల్లాలో అన్నిరకాల పెన్షన్ల మొత్తం 2,87,845 మందికి రూ. 85.94 కోట్లు...* 


ఏలూరు: ఏలూరు జిల్లాలో 2,33,726 మందికి సంబంధించి 2024 జనవరి నుంచి పెన్షన్ రూ. 2,750/- నుంచి రూ. 3 వేలకు పెంపుదల చేయడమే కాకుండా మరో  9 వేల 326 మందికి కొత్త పెన్షన్లు మంజూరు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ చెప్పారు. 

 By: E city News 

తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయం నుంచి గురువారం  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ, జనవరి 1 నుంచి నిర్వహించే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం, విజయవాడలో జనవరి 19వ తేదీన డా. బిఆర్. అంభేద్కర్ కాంస్య విగ్రహం ఆవిష్కరణ సందర్బంగా జిల్లాల్లో నిర్వహించే కార్యక్రమాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు.  


ఈ వీడియో కాన్ఫరెన్స్ కు ఏలూరు జిల్లా కలెక్టరేట్ లోని విసి హాలు నుంచి జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్, దెందులూరు శాసన సభ్యులు కొఠారు అబ్బయ్యచౌదరి, చింతలపూడి శాసన సభ్యులు ఉన్నమట్ల ఎలీజా, డిఆర్డిఏ పిడి డా. ఆర్. విజయరాజు  పాల్గొన్నారు.  


వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ జనవరి 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. జనవరి 23వ తేదీన వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం, ఫిబ్రవరి 5వ తేదీన వైఎస్ఆర్ చేయూత, ఆర్ధిక సహాయం అందించే కార్యక్రమాలు నిర్వహించబడతాయన్నారు. 


వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద ఏలూరు జిల్లాలో 2,33,726 మందికి వృద్ధాప్య, వితంతు, చేనేత, మత్స్యకార, కల్లుగీత కార్మికులు, చర్మ కార్మికులు, ఒంటరి మహిళలకు జనవరి 1వ తేదీ నుంచి రూ. 2,750/- నుంచి రూ. 3 వేలకు ప్రభుత్వం పెంపుదల చేసిందన్నారు.  జిల్లాలో 2,33,726 మంది పెన్షన్లకు గాను పెంచిన మొత్తం కింద ప్రతినెలా అధనంగా రూ. 5.84 కోట్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అదే విదంగా వీటితోపాటు జిల్లాలో మిగిలిన ఇతర రకాల పెన్షన్ల తో కలిసి మొత్తం 2 లక్షల 87 వేల 845 మందికి రూ. 85.94 కోట్లు జనవరి 1వ తేదీ నుంచి పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఇందులో జనవరి నెల నుంచి కొత్తగా మంజూరు చేసిన 9వేల 326 పెన్షన్లు ఉన్నాయన్నారు. ఇతర పెన్షన్ల కింద 44 వేల 793 మంది  లబ్దిపొందుతున్నారన్నారు.


జిల్లాలో జనవరి 23వ తేదీ నుంచి 31 వరకు వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలో వైఎస్ఆర్ ఆసరా కింద 35 వేల 751 సంఘాలకు చెందిన 3 లక్షల 55 వేల 358 మహిళలకు నాలుగో విడతగా రూ. 328.34 కోట్లు విడుదల చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఫిబ్రవరి 5వ తేదీన వైఎస్ఆర్ చేయూత పధకం ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఫిబ్రవరి 5 నుంచి 14వ తేదీ వరకు వై ఎస్ ఆర్ చేయూత అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలో వై ఎస్ ఆర్ చేయూత నాలుగో విడత కింద 1,16,046 మంది లబ్దిదారులకు రూ. 217.58 కోట్లు విడుదల చేయడం జరుగుతుందన్నారు. ఆయా పధకాల కింద మండల, గ్రామ స్ధాయిలో కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.

Previous Post Next Post