ఓటర్ల జాబితాలో అధిక సంఖ్యలో చేర్పులు, తొలగింపులు జరిగిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి, తనిఖీ చేయాలన్నారు. ఒకే డోర్ నెంబర్ లో 10 కి మించి ఓటర్లు నమోదైన వాటిని పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి, వారి సూచనలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లాలో ఓటర్ల జాబితా సవరణలో తీసుకుంటున్న చర్యలను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా కు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలియజేస్తూ ఏలూరు జిల్లాలో ఒకే డోర్ నెంబర్ లో 10 కి మించి ఓటర్లు నమోదైన అంశంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి, బీఎల్వో లతో తనిఖీ చేయిస్తున్నామన్నారు.
అదేవిధంగా ఓటర్ల జాబితాలో అధిక సంఖ్యలో చేర్పులు, తొలగింపులు జరిగిన ప్రాంతాలలో ప్రతీ దరఖాస్తులో తెలియజేసిన అడ్రెస్స్ లలో పరిశీలిస్తున్నామన్నారు. జిల్లాలో 100 సంవత్సరాల వయస్సు నిండిన ఓటర్ల ను పరిశీలిస్తున్నామని, చనిపోయిన వారి పేర్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఓటర్ల జాబితా నుండి తొలగిస్తున్నామన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులను 12 వేల 994 కుటుంబాలవారిని పునరావాస కాలనీలకు తరలిస్తున్నామని, వారికి అక్కడ ఓటు హక్కు కల్పిస్తున్నామన్నారు. అందుచేత పునరావాస కాలనీల ప్రాంతాలలోని ఓటర్ల జాబితాలో అధిక సంఖ్యలో చేర్పులు ఉంటాయన్నారు.
18 సంవత్సరాల వయస్సు నిండిన ప్రతీ ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ బి. లావణ్యావేణి, నూజివీడు సబ్ కలెక్టర్ ఆదర్ష్ రాజేంద్రన్, జిల్లా పరిషత్ సీఈఓ కె. రవికుమార్, ఏలూరు, జంగారెడ్డిగూడెం ఆర్డీఓ లు కె. పెంచెల్ కిషోర్, ఝాన్సీరాణి, ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ ఎస్. వెంకటకృష్ణ, డి ఆర్ డి ఏ పీడీ విజయరాజు, నియోజకవర్గాల తహసీల్దార్లు, ప్రభృతులు పాల్గొన్నారు.